Saturday, January 3, 2015

ఉసిరి ఆకలిని పెంచుతుంది


 ఉసిరి కాయ అనగానే అందరికీ నోట్లో లాలాజలం వచ్చేస్తోంది. ఉసిరి చూడడానికి చిన్నదిగా ఉన్న ఎన్నో లాభాలనిస్తోంది. ఉసిరి చెట్టును ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్‌గా చెప్పుకుంటారు. అంతే కాకుండా ఉసిరి తీపి, చేదు, పులుపును కలిగి ఉంటుంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉసిరి ఆకలిని కూడా పెంచుతుంది. ఉసిరిలో సి విటమిన్‌తో పాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. క్యాన్సర్, గుండె వ్యాధుల నుంచి ఉసిరి కాపాడుతుంది. ఉసిరిని తరుచుగా తీసుకుంటే దగ్గు, మలబద్ధకం, వాతం నుంచి బయటపడొచ్చు. అనేక రోగాల నివారణకు ఉసిరి సహాయపడుతుంది. శిరోజాలు పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఉసిరిలో పీచు ఎక్కువగా ఉండటంతో మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం అవుతోంది. డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. రెండు స్పూన్ల ఉసిరి రసం, రెండు స్పూన్ల తేనేను ప్రతి రోజు ఉదయం కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి నివారణ పొందవచ్చు. చాలా కాలం నుంచి దగ్గు బారిన పడ్డవారు కొంచెం మోతాదులో ఉసిరి పౌడర్‌ను రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు. నోటి పగుళ్లతో బాధ పడే వారు రోజుకు రెండు సార్లు ఉసిరి రసాన్ని మామూలు నీటిలో తీసుకుని పుక్కిలిస్తే నయం అవుతుంది.

ఉసిరి హెయిర్ డాండ్రఫ్‌ను కూడా తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉసిరి పౌడర్‌ను ప్రతి రోజు రాత్రి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు. ప్రతి రోజు అన్నం తిన్న తర్వాత టీ స్పూన్ ఉసిరి పౌడర్‌ను తేనేతో కలిపి రోజు తాగితే ఎసిడిటీ నుంచి బయటపడవచ్చు. మీ ఆహారంలో ప్రతి రోజు ఉసిరి ఉంటే మీరు ఆరోగ్యంగా ఉండగలరు.

No comments:

Post a Comment